డీ లిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం . తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మీడియా తో “చిట్ చాట్” నిర్వహించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషను
2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు. అందరి సంక్షేమం కోసం ఆమోదయోగ్యమైన మహిళ బిల్లుకు వంద శాతం మద్దతు ఇస్తాం, కానీ అశాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తాం అని తెలిపారు.
డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని తెలంగాణ దేశానికి (కేంద్రానికి) రూ.5 ఇస్తే, తిరిగి తెలంగాణకు రూ.2 మాత్రమే ఇస్తుంది. తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం కోసం కాగ్నా నుండి నీటి సరఫరా కు, అన్ని వార్డుల్లో బోర్లు వేసి త్రాగునీరు అందించడానికి తాండూరు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కౌన్సిల్ లో అన్ని అంశాలపై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) మరియు నీటి సరఫరాపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది.
తాండూరు సమస్యలపై త్వరగా స్పందించి, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి తాండూరు ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.