ముద్ర కూకట్పల్లి:
జిల్లా పార్టీ నియామకాల్లో కూకట్పల్లి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గురువారం కూకట్పల్లి పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నూతన కమిటీ సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవులు పొందిన వారు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 18న ఎన్ఎస్‌యూఐ చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.