ముద్ర, తాండూర్:
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తాండూర్ మున్సిపల్ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 12వ వార్డులో జిమ్ పార్క్ వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉండగలమన్నారు. కావున ప్రతి ఒక్కరూ తాండూర్ పట్టణాన్ని సుందరంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, టౌన్ ప్లానింగ్, వార్డ్ ఆఫీసర్లు, మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.