Take a fresh look at your lifestyle.

గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తోన్న వనరులు
జీసీసీ ఏర్పాటుకు ముందుకువచ్చిన పికో టెక్నాలజీ ఇండియా

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

నైపుణ్యాలతో కూడిన టేలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. న్యూయార్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజి సంస్థప్రతినిధులు శనివారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శ్రీధర్ బాబు, రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ఫైనాన్సియల్ మార్కెట్‍కు సంబంధించిన సేవలు అందించే పికో టెక్నాలజీ ఇండియా అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంసర్భంగా ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రానున్న 20 ఏండ్ల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. బెంగళూరు, ముంబాయి నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంబయిలో అది 52 శాతం మాత్రమేనని తెలిపారు. బెంగళూరు, ముంబయి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటి సంస్థలు, జీసీసీలు హైదరాబాద్ కు తరలి వస్తున్నాయని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలో వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్ నగర్- ఎల్బీనగర్ ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని పైన ఉండే రెండు అండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని అన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పికో టెక్నాలజీ వ్యవస్థాపక సిఇఓ జారొడ్ యుస్టర్, పికో ఇండియా సిఇఓ హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.