ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపాలిటీ లో ఉన్నటువంటి బృదావన కాలువను సుందరీకరణ చేస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బృందావన్ కాలువను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ సహకారం తో బృదావన కాలువ ను సుందరికరణ చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు బిసు శ్రీకాంత్, పన్నాల శ్రీ విద్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ సతీష్ పాల్గొన్నారు.