Take a fresh look at your lifestyle.

చక్రిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఏకవాక్య సంకీర్తనలు

 

ముద్ర కాప్రా:

చక్రిపురం శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు మొదలైన శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏకవాక్య సంకీర్తనలు మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల వరకు కొనసాగినాయి. భక్తి పాటలు భక్తులను ఎంతో అలరించాయి ముఖ్యంగా హిందు వాహిని నేత అరవింద్ హనుమాన్ చాలీసా ఓం నమో నారాయణాయ శ్రీరామ జయ రామ ఏడుకొండలవాడా వెంకటరమణ భక్తి పాటలతో ఆలయ ప్రాంగణమంతా దద్దరిల్లింది. ఏకవాక్య సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు పాటలు పాడారు అరవింద్ మాట్లాడుతూ పిల్లలకు హిందూ ధర్మం గురించి నేర్పాలని పెడదోవ దారిన పడుతున్నారని నేటి బాలలు రేపటి బాలనాలని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఫౌండర్ మూలుగు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భక్తితో మానసిక ప్రశాంతత ఉంటుందని ప్రతిరోజు ఆలయానికి వచ్చి గంట గడుపుతే మనసు ఎంతో ప్రశాంతత ఉంటుందన్నారు 200 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.