Take a fresh look at your lifestyle.

బట్టు మహేందర్ కి అన్ని విధాలుగా అండగా ఉంటాం : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పట్టణంలోని 22వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్టు మహేందర్ మంగళవారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఘట్కేసర్ లోని నీలిమ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని స్థానిక కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా శుక్రవారం హాస్పటల్ కి వెళ్లి మహేందర్ ను పరామర్శించారు. అలాగే హాస్పటల్ చైర్మన్ తో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్య అందించాలని వైద్య ఖర్చులు తానే చూసుకుంటానని చెప్పి, వారి కుటుంబానికి కూడా అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్, పిసిసి డెలిగేట్ తంగళ్లపల్లి రవి కుమార్ నాయకులు కుక్కదువు సోమయ్య, షఫీక్ అహ్మద్, బేండే లాలరాజ్, ఈరపాక నర్సింహా, సయ్యద్ ముల్తానిష, బిక్షపతి, మనీష్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.