Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వైఖరితో అన్నదాతకు అరిగోస -బీజేఎల్పీ నేత ఏలేటి ధ్వజం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల అన్నదాతకు గోస తప్పడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోసలు పడు తున్నారన్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అన్నదాతలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో  ఎక్కడికక్కడ కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను  చూసి అధికారులను నిలదీశారు. కొనుగోలుకు సంబంధించి ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని సూచించారు. రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో కొనుగోలు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మరో పక్క వరి ధాన్యం కోతకు వచ్చి కల్లాలకు వస్తుంటే  అకాల వర్షాలు సంభవిస్తాయని ఒక వైపు రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు గన్ని బ్యాగ్ లు, లారీ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి ఏర్పాట్లను చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.