డిగ్రీ పాసైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కీలకమైన IELTS( ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) ఉచిత కోచింగ్ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈనెల 9వ తేదీన సోమవారం బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ లో నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పక హాజరు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విదేశాలలో విద్య, ఉద్యోగం ఆంగ్ల భాష నైపుణ్యాలను అంచనా వేసే అంతర్జాతీయ పరీక్ష పై,విదేశాలలో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను, వాటికి కావాల్సిన స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు (ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా)
IELTS ఉచిత కోచింగ్ కు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేరుగా తమ దరఖాస్తులను బిసి స్టడీ సర్కిల్ కరీంనగర్ లో
టెన్త్, ఇంటర్, డిగ్రీ, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా
అందజేయాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 040- 24071178,0878- 2268686 నెంబర్ లను, సంప్రదించాలని తెలియజేశారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.