Take a fresh look at your lifestyle.

సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు ను కలిసిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ప్రతినిధులు

  • కార్మిక సమస్యల పరిష్కారానికి వినతులు.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నేతృత్వంలో మంగళవారం ఐ ఎన్ టి యు సి ప్రతినిధి బృందం,సింగరేణి డైరెక్టర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) గౌతమ్ పోట్రు ని వారి కొత్తగూడెం కార్యాలయంలో మర్యాదపూర్వ కంగా కలిసింది. ఈ సందర్భంగా సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలపై చర్చ జరగ్గా,వాటి తక్షణ పరిష్కారాన్ని కోరారు.కార్మికుల పేర్ల మార్పుపై అనేక సంవత్సరాలుగా సమస్యలు నెలకొనడాన్ని గుర్తుచేస్తూ, తక్షణమే సర్క్యులర్ జారీ చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.మెడికల్ బోర్డుల నిర్వహణ లోపాలు హయ్యర్ సెంటర్‌కు రిఫర్ అయిన కార్మికులకు కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల జీతాలు నిలిపివేయబడి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ బోర్డులను రెగ్యులర్‌గా నిర్వహించాలని కోరారు. తొలగించబడిన కార్మికులకు మరో అవకాశం ఉద్యోగం నుండి తొలగించబడిన మైనింగ్ సిబ్బందికి (సర్దార్లు సహా) ఒకవేళ వన్ టైమ్ రీ-ఎంప్లాయిమెంట్ అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.

  • నైని బ్లాక్ కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్.

ప్రస్తుతం ఇతర శాఖల నుండి ఎస్ అండ్ పిసి ని నైని బ్లాక్‌కు పంపే ప్రక్రియను నిలిపివేసి,నైని బ్లాక్ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేపట్టాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారం దాదాపు 3,700 మందికి పైగా ఉద్యోగుల కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉండటంతో, ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా వీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మందుల కొరత పరిష్కారం ఏరియా ఆసుపత్రు లన్నింటిలో మందుల కొరత తలెత్తిన నేపథ్యంలో,తగిన ఔషధాలను తక్షణమేఅందుబాటు లోకి తీసుకురావాలని కోరారు.మెడికల్ బోర్డు ద్వారా తిరిగి వచ్చిన వారికి వన్ టైమ్ సెటిల్మెంట్ ఫిట్ ఫర్ సేమ్ డ్యూటీ” గా ప్రకటించబడి, రిటైర్మెంట్‌కు రెండేళ్లలోపు ఉన్న కార్మికులకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద మరో అవకాశాన్ని కల్పించాలని సూచించారు.ప్రస్తుత ట్రాన్స్ఫర్ పాలసీ రద్దు ప్రస్తుతం అమలులో ఉన్న బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  • సర్వే ఆఫీసర్ల భర్తీ.

ఖాళీగా ఉన్న సర్వే ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.కార్మికుల సమస్యల పట్ల డైరెక్టర్ గౌతమ్ పోట్రు సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి అంశాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో పాల్గొన్నసెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహరెడ్డి,ధర్మపురి,త్యాగరాజన్,జెట్టి శంకర్ రావు,జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.