Take a fresh look at your lifestyle.

పని వృత్తి వాళ్లకు పారితోషకాలు పెంచండి

  • జ్ఞాపికను అందజేస్తున్న పని వృత్తి వాళ్ళ అధ్యక్షుడు టి శివశంకర్.

మెహిదీపట్నం ముద్ర: గోల్కొండ బోనాల సందర్భంగా పనివృత్తి వాళ్ళ పారితోషకాలను పెంచాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ అన్నారు. గోల్కొండ బోనాల సమీక్ష సమావేశం సందర్భంగా పనివృత్తి వాళ్ళ అధ్యక్షుడు టి శివశంకర్ వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 26 రకాల పనివృత్తి వాళ్లు నిత్యం అమ్మవారి సేవలు చేయడంతోనే బోనాల నిర్మాణం ఉంటుందన్నారు. తమ సమస్యలను పరిష్కరించడంతోపాటు, బోనాల సందర్భంగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించడంలో అధికారులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే కౌసర్ మాట్లాడుతూ.. గోల్కొండ బోనాల సందర్భంగా నెల రోజులకు గాను పనివృత్తి వాళ్లకు ఒక్కొక్కరికి కేవలం 4000 రూపాయలు చెల్లిస్తున్నారన్నారు.అధికారులు వారి కష్టాన్ని గుర్తించి ఈ బోనాల సందర్భంగా 4వేలకు బదులుగా ఒక్కొక్కరికి 20వేల రూపాయలు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యలు వివరించిన వారిలో ఆయన వెంట నర్సింగ్ రావు, సుధీర్ రావు, డప్పు రవి, అశోక్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.