ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మ్యాట్ విజ్ సంస్థతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ట్రిపుల్ ఐటీ మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కు చెందిన మాట్ విజ్ సంస్థకు మధ్య ఆదివారం ఈ ఒప్పందం జరిగింది. ట్రిపుల్ ఐటీ వి సి గోవర్ధన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మెటలర్జీ, మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగాల్లో నూతన సాంకేతిక అంశాలను ఆవిష్కరించటం, ఉమ్మడి పరిశోధనలు చేయడమే ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం.