. ఎన్నికల తర్వాతే చైర్మన్ అభ్యర్థి ప్రకటన
. తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి
ముద్ర: తాండూర్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని, వచ్చే మూడేళ్లలో తాండూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాండూర్ మున్సిపల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, ప్రతి వార్డులో ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించడమే ఎందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. గత పాలకుల సమయంలో పాత తాండూర్ రైల్వే బ్రిడ్జ్, చిలుక వాగు, గొల్ల చెరువు పనులు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. వచ్చే 2028 నాటికి తాండూర్ అభివృద్ధికి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేశామని, రూపాయలు 550 కోట్లతో తాండూర్ లొ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తామని తెలిపారు. తాండూర్ లోని నాపరాతి పరిశ్రమను ఒకే దగ్గరికి తెచ్చి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అంతరాయానికి ప్రత్యామ్నాయంగా కాగ్న నది నీటిని సరపర చేయిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంతో పాటు, ఇలాంటి అక్రమాలు, ఆక్రమణలు జరగకుండా తాండూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఏడవ గ్యారంటీ అని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసిబి అధ్యక్షులు ధారాసింగ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మురళి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.