Take a fresh look at your lifestyle.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర మల్కాజిగిరి:

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు కలిసి తమ తమ ప్రాంతాల సమస్యలను వినతిపత్రాల ద్వారా అందజేశారు.
మచ్చ బొల్లారం డివిజన్లోని ఏడు కాలనీల డ్రైనేజీ ట్రంక్ మెయిన్ సమస్య
మౌలాలి వినాయక నగర్ డివిజన్లో మధ్యగల వెంకటేశ్వర నగర్ కాలనీలో డ్రైనేజీ పైపులైను,
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్లోని సత్య రాఘవేంద్ర కాలనీ లంబాడి బస్తీలో విద్యుత్ దీపాలు వేయించాలని, రోడ్డుకు అడ్డుంగా ఉన్న స్తంభాన్ని తొలగించాలని,
వెంకటాపురం డివిజన్ కామాజిగూడ లో విద్యుత్ దీపాలు వేయించాలని , సింగిల్ ఫేస్ నుండి త్రీఫేస్ కరెంటు సరఫరా చేయించాలని కోరారు. కానాజిగూడ నుండి టెలికం కాలనీ కమాన్ మార్గంలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ఖానాజిగూడ స్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.