Take a fresh look at your lifestyle.

రంగారెడ్డి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ పోలింగ్

సజావుగా మున్సిపల్ ఎన్నికలు

జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ

చేవెళ్ల మున్సిపల్ పరిధిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ నారాయణరెడ్డి

(ముద్ర , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు జరగకుండా, తప్పిదాలకు తవ్వివకుండా, సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో బుధవారం రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్బంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీ చేయు వార్డు సభ్యుల జాబితాను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరి చూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి చిన్న పొరపాట్లుకు తావ్వివకుండా సజావుగా నిర్వహించాలన్నారు. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావ్వివకుండా ప్రశాంతగా చేపట్టాలని కలెక్టర్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.