Take a fresh look at your lifestyle.

వైభవంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయ వార్షికోత్సవం

కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణంలోని పటేల్ రోడ్ లో ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయ 66 వ వార్షికోత్సవం శుక్రవారం రోజు అంగ రంగ వైభవంగా జరిగింది. అర్చకులు సుంకేట శాంతమూర్తి ఆధ్వర్యంలో ఉదయం అన్నపూర్ణాదేవి ఆలయ విగ్రహానికి ఫల, పంచామృతాభిషేకాలను వేద మంత్రోచ్ఛరణతో భక్తుల భజనల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు. పూజానంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.