Take a fresh look at your lifestyle.

గంజాయి సేవిస్తున్న మహిళతో పాటు మరో నలుగురు అరెస్ట్

మాదాపూర్, ముద్ర: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రయివేటు భవనంలో గంజాయి సేవిస్తున్న మహిళతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురవారం మధ్యాహ్నాం మాదాపూర్ లోని జీఆర్సీ రెసిడెన్సీ భవన్ లోని పెంట్ హౌజ్ లో గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు దాడిచేసి వారిని అదుపులోకి తీసుకుని మూత్ర పరీక్షలు చేయించారు. ఆ ప్రాథమిక పరీక్షలో ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవించినట్లుగా నిర్ణారణ అయిందని, గంజాయి సేవిస్తున్న వారిలో కుమారి ప్రియాంక రెడ్డితో పాటు ఎ.వెంకటేష్, పి విజయ్ రెడ్డి, ఎం రాహుల్, ఎస్.శివకుమార్ లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు నిజామాబాద్ వాసులు కాగా కుమారి ప్రియాంక రెడ్డి హైదరాబాద్ వాసి అని, ప్రియాంక గతంలోనూ డ్రగ్స్ కేసులో పట్టిబడినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. వీరికి మత్తు పదార్థాలు అమ్మిన వ్యక్తులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ క్రిష్ణమోహన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.