ముద్ర ప్రతినిధి, నిర్మల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగాపని చేయాలని నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నిర్మల్ క్యాంపు కార్యాలయంలో నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త గ్రామాలలో ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీలైన బిజెపి బిఆర్ఎస్ లకు ధీటుగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తోడ్పాటుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించు కోవాలని దిశా నిర్దేశం చేశారు.