Take a fresh look at your lifestyle.

​కెపిహెచ్‌బి శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వైభవంగా కుంభాభిషేకం: పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

 

​ముద్ర కూకట్‌పల్లి :

కెపిహెచ్‌బి 4వ ఫేజ్ లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శనివారం కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
​ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుంభాభిషేకం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.
​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, ఆధ్యాత్మిక నినాదాలతో మారుమోగాయి. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.