Take a fresh look at your lifestyle.

శంషిగూడలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

ముద్ర కూకట్‌పల్లి :

శంషిగూడలోని శ్రీ నక్షత్ర రూప అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగింది.
​ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి రమేష్ హాజరయ్యారు.
​ఈ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య, శాస్త్రోక్తంగా హోమాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి రమేష్ స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.
​కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బండి రమేష్‌ను శాలువాతో కప్పి, స్మారక చిహ్నంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి మార్గం ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని, శంషిగూడలో ఇలాంటి గొప్ప ఆలయం నిర్మించడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో శంషిగూడ ప్రాంతం ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది

Leave A Reply

Your email address will not be published.