Take a fresh look at your lifestyle.

మల్క కొమురయ్య విజయోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కరీంనగర్,నిజామాబాద్,మెదక్,ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు చేసుకున్నారు.నిర్మల్ జిల్లా మేధావి వర్గం అయిన ఉపాధ్యాయులు తెలంగాణ దశ దిశను నిర్ణయించి విజయాన్ని అందించడం జరిగిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన తెలంగాణలో కూడా రావాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలవడం చాలా సంతోషకరమని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మేధావుల,ప్రజల సహకారంతో ఏర్పాటు చేయబోతుందని వారి తీర్పు ఋజువు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,జిల్లా మాజీ అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి,నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ రెడ్డి,మెడిసిమ్మె రాజు,పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ సుంకరి సాయి,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్,బిసి మోర్చా జిల్లా అధ్యక్షులు నరేంద్ర చారి,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొండాజి శ్రవణ్,జిల్లా కౌన్సిల్ మెంబర్లు అల్లం భాస్కర్ శ్రీరామోజీ నరేష్ పట్టణ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.