ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పంపిణీ చేశారు. జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్ రావు పేట్ రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లు చేయగ కలెక్టర్ పాల్గొని పంపిణి చేశారు. కోరుట్ల మండలంలో 414 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి కాగా ఇందులో 5 గ్రామాలలో 114 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పాత్రలను అందచేశారు. కోరుట్ల మండలంలోమిగతా ఇండ్ల మంజూరి పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మఇండ్ల మంజూరు పత్రాలను వారి వారి గ్రామాలలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, హౌసింగ్ పి డి ప్రసాద్ ఎమ్మార్వో కృష్ణ చైతన్య, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
