- బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం.
- ఆ రాష్ట్రంలో 22 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం.
- వెల్లడించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఇతర రాష్ట్రాలలో విద్యుత్ ఉత్పతి ప్లాంట్ల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో ఉత్తర భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో 22 జల విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా శనివారం సిమ్లా లో తెలంగాణ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలు, హిమాచల్ ప్రదేశ్ లోని రెండు ప్రధాన హైడ్రో పవర్ ప్రాజెక్టులైన సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) అభివృద్ధిలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా పొందే విద్యుత్ తెలంగాణ రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ..2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడనుంది. ఈ ఒప్పందం ప్రకారం
2030 నాటికి 20000 మెగావాట్లు,2035 నాటికి 40వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుంది. హిమాచల్ జలవనరుల వినియోగం ద్వారా, తెలంగాణ ప్రజలకు తక్కువ ఖర్చుతో, విశ్వసనీయమైన, పర్యావరణ హిత విద్యుత్ సరఫరా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. హైడ్రో విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువ, థర్మల్ పవర్ తో పోల్చినపుడు ఆర్థికంగా రాష్ట్రానికి మరింత మేలు జరగనుంది. ఈప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం జెన్కో నామినేషన్ పద్ధతిలో చేపట్టనుంది. ఇది అంతర్రాష్ట్ర విద్యుత్ సహకారానికి గొప్ప ఉదాహరణగా ఈ సందర్భంగా డిప్యూుటీ సీఎం భట్టి పేర్కొన్నారు.ఈ ఒప్పందం తెలంగాణ-హిమాచల్ మధ్య బలమైన సంబంధాలకు ప్రతిబింబమన్నారు.లంగాణ ప్రభుత్వ విధానం విద్యుత్ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా సాగుతోంది.పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు మా కృషి సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్ పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖి, జెన్కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానంద, హిమాచల్ ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేష్ ప్రజాపతి, హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ సెక్రటరీ ఎనర్జీ అరిందం చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Prev Post