Take a fresh look at your lifestyle.

కాప్రాలో ప్రణాళికాబద్ధంగా శానిటేషన్ పనులు

 

ముద్ర కాప్రా

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 శానిటేషన్ కార్యక్రమాలు వేగవంతంగా చేపడుతున్నట్లు ఎడిషనల్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు, కాప్రా సర్కిల్ ప్రాంతాల్లో పర్యటించి ఆయన పరిశుభ్రత ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రత్యేకంగా మసీదులు, దర్గాల పరిసరాల్లో సానిటేషన్ పరిస్థితులను సమీక్షించిన ఆయన, గ్రీన్ వేస్ట్ నిర్వహణలో ఉన్న సమస్యలను గుర్తించారు. రామ్కీ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద స్వచ్ఛ ఆటోలు ఇంటింటి నుండి సేకరించే చెత్తను ఇబ్బందులు లేకుండా తరలించేందుకు అవసరమైన కంటైనర్ల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా కుషాయిగూడ వాసవి శివ నగర్ ప్రాంతంలో ప్రైవేట్ స్థలంలో డంప్ చేసిన గ్రీన్ వేస్ట్‌ను తక్షణమే తొలగించాల్సిందిగా రామ్‌కీ సంస్థ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్లు రామకృష్ణ, శ్రీనివాస్, ఎస్ సుజాత, వసంత, రామ్‌కీ ఉప్పల్ జోనల్ ఇంచార్జ్ కృష్ణ, కాప్రా సర్కిల్ ఇంచార్జ్ నవీన్ కుమార్ రెడ్డి, సూపర్వైజర్ శృతి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ అధికారులు చేపడుతున్న ఈ చర్యలతో ప్రాంతాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.