Take a fresh look at your lifestyle.

నిరంతర ప్రక్రియగా నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోంది

  • రేషన్ కార్డుతో పేద కుటుంబాలకు 10 లక్షల కవరేజి తో ఆరోగ్య శ్రీ లబ్ది.
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నిరంతర ప్రక్రియగా నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి భీమారం మండల కేంద్రంలో ఎంపీడి ఓ కార్యాలయంలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భీమారం మండలంలో 411 పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 1077 రేషన్ కార్డులలో కొత్త సభ్యులను జమ చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలు జీవనం కొనసాగించాలంటే రేషన్ కార్డు చాలా ముఖ్యమైనదని ఇచ్చిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగ పడుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని అన్నారు. గత పది సంవత్సరాలుగా ఒక పేద కుటుంబానికి రేషన్ కార్డు, ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని అన్నారు. నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్వో, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.