Take a fresh look at your lifestyle.

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటన

  • రేషన్ కార్డుల పంపిణీ, పాఠశాల సందర్శన.

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీఘన్పూర్ మండలం కూచన్ పల్లిలో కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పర్యటించారు. నూతన రేషన్ కార్డులు పంపిణీలో పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. పశు వైద్యశాల ఆకస్మిక తనిఖీ చేశారు. సన్న బియ్యం, నూతన రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. హవేలీఘన్పూర్ మండలంలో అర్హత కలిగిన వారికి 650 రేషన్ కార్డులు అందించడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు 1917 మందికి చేయడం జరిగిందన్నారు.కూచన్ పల్లిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, 33 మందికి ఇవ్వడం జరిగింది, కొత్తగా కుటుంబ సభ్యుల పేరు నమోదు కోసం 114 చేయడం జరిగిందన్నారు.రేషన్ కార్డు అనేది ఒక చిరకాల కోరిక అని అన్నారు. ప్రతి పేదవాడికి సన్న బియ్యం తినాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గొప్ప కార్యక్రమం చేపట్టిందన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల సందర్శించి విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించారు.పాఠశాలలో వసతులు, పిల్లల సామర్థ్యాలు, నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.పశు వైద్యశాలను తనిఖీ చేశారు. పశువైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని, కాలానుగుణంగా పశువులకు వచ్చే వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాక్సినేషన్ అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి, హవెలి ఘనపూర్ తహసిల్దార్ సింధు రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.