ముద్ర.వీపనగండ్ల : కుటుంబ కలహాలతో విరక్తి చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ కె రాణి కథన ప్రకారం మండల పరిధిలోని బొల్లారం గ్రామానికి చెందిన రాచాల శ్రీనివాస్ గౌడ్(50) అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా భార్య పిల్లలతో కలిసి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బ్రతుకుదురు కోసం నివసిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం గ్రామంలో రాచాల శ్రీనివాస్ గౌడ్ చెందిన బంధువు ఒకరు చనిపోవడంతో గ్రామానికి రావడం జరిగిందని బంధువులు తెలిపినట్లు ఎస్సై తెలిపారు. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో విసుగు చెందిన రాచాల శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య నీరజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.