Take a fresh look at your lifestyle.

పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు ఘన సన్మానం హాజరైన ఆర్టీసీ రీజనల్ డిప్యూటీ ఆర్ ఎం కవిత

ముద్ర, వనపర్తి :

ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని టీ జి ఎస్ ఆర్ టి సి రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం కవిత అన్నారు. వనపర్తి ఆర్టీసీ డిపోలో మెకానికల్, కండక్టర్, డ్రైవర్ విభాగాలలో నలుగురు ఉద్యోగులు రహీమ్, వివి మూర్తి, నీలయ్య,రాములు పదవీ విరమణ పొందిన సందర్భంగా శనివారం డిపో ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ ఆర్ ఎం మాట్లాడుతూ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఆర్టీసీ సంస్థలో వివిధ హోదాలలో పనిచేసి సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆర్టీసీని కన్నతల్లిలా భావించి తాము బతుకుతూ సంస్థను బతికిస్తూ నీతి నిజాయితీతో వృత్తి ధర్మాన్ని పాటించి కుటుంబాల అభివృద్ధి కోసం పాటుపడడం గర్వించదగ్గ విషయం అన్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగులు పదవి విరమణ పొందుతుండడం కొంత బాధాకరమని అన్నారు. కొత్త జనరేషన్ కు స్ఫూర్తినిచ్చేలా మరి కొంతకాలం చిత్తశుద్ధితో పనిచేసే ఇలాంటి ఉద్యోగులు ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతూ ఏ ఉద్యోగి కైనా రిటైర్మెంట్ తప్పనిసరి అయినందున పదవి విరమణ తీసుకోక తప్పదు అన్నారు. వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి నందు వల్లే ఎంతో మంది తోటి సహచరులు, మిత్రులు, బంధువుల ఆదరాభిమానాలు చూరగొన్నారని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ వనపర్తి డిపోలో పనిచేసిన ఉద్యోగులు సంస్థ కోసం అహర్నిశలు శ్రమించి మంచి పేరు తెచ్చి పెట్టారని ప్రశంసించారు. పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల సేవలను ఆయన కొనియాడారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్, వనపర్తి ఆర్టీసీ డిపోలో నలుగురు ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ పొందిన సందర్భంగా జరిగిన సన్మాన సభ కు హాజరైన టి యు డబ్ల్యూజె ఐజెయు రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ లో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది నీతి నిజాయితీకి మారుపేరని అన్నారు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కొనసాగించడం తోపాటు వారి కుటుంబాలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలు స్తున్నారని కొనియాడారు. ఫలితంగానే ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల పిల్లలు ఉన్నత చదువులలో రాణిస్తున్నారంటే ఆర్టీసీ లో అలవర్చుకున్న క్రమశిక్షణనే నని తెలిపారు. జర్నలిస్టులకు ఆర్టీసీకి మధ్య అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమా శంకర్, వనపర్తి డిపోకు చెందిన పలువురు యూనియన్ నాయకులు,పదవి విరమణ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీకి కంకణ భక్తులై క్రమశిక్షణతో పనిచేసి కుటుంబాల అభ్యున్నతికి తోడ్పాటు అందించారని అన్నారు. తక్కువ పాటి జీతమైనా ఉన్నదాంట్లోనే సంతృప్తి పడుతూ కుటుంబాలను పోషించుకున్నారని తెలిvపారు. పదవి రమణ అంతరం భావి జీవితం ఆనందమయంగా గడపాలని వారు ఆకాంక్షిస్తూ పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు

Leave A Reply

Your email address will not be published.