Take a fresh look at your lifestyle.

ఘనంగా జాతీయ వైజ్ఞానిక శాస్త్ర దినోత్సవం

 

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లోని జిన్గుర్తి మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ పాఠశాలలో జాతీయ వైజ్ఞానిక శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభతో తయారుచేసిన వివిధ రకాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు శాస్త్రీయ నమూనాలు, వినూత్న ఆవిష్కరణలు, పర్యావరణం, సాంకేతికత ఆరోగ్య అవగాహన అంశాలపై ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వినోద్ కన్నా మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసుకుంటేనే వారు అనుకున్న లక్ష్యాలను సాధించి, గొప్ప ఆవిష్కరణలు సృష్టించే వారవుతారని ఆయన తెలిపారు. నేటి ఆధునిక జీవితం సైన్స్ తో ముడిపడి ఉందని ఈ సైన్స్ నుండి విద్యార్థుల్లో మానవ జీవనశైలిలో వికాసం పెంపొందుతుందన్నారు. వివిధ రంగాల్లో రాణించిన మహనీయుల స్ఫూర్తితో విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వినోద్ కన్నా, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.