మల్యాల, ముద్ర విలేకరి: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం మండలంలోని నూకపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు నూలుగొండ సురేష్ తో పాటు 30 యువకులు, రామన్నపేట గ్రామం నుండి మైనారిటీ మహిళ నాయకులకు కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, దారం ఆది రెడ్డి, శనిగారపు తిరుపతి, మ్యాక లక్ష్మణ్, మిల్ట్రీ శ్రీనివాస్, బీవీ రమణ పటేల్ తదితరులు పాల్గొన్నారు.