ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఉచిత క్రికెట్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, జిల్లా ఎస్పి ఆకాంక్ష యాదవ్ లు అన్నారు.

మంగళవారం భువనగిరి పట్టణంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ), నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనుద్దీన్, జిల్లా ఇంచార్జి అబోతుల కేతన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
నిపుణులైన కోచ్ లతో అండర్-14, 16, 19 బాలబాలికల విభాగాల్లో గణేష్ అకాడమీ వారి సహకారం తొ నిర్వహించడం జరుగుతుందని
ఉదయం 7 గంటల నుండి 9 వరుకు నిర్వహించడం జరుగుతుందని వివరాలకు 8341313449 నెంబర్ కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ సతీష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.