Take a fresh look at your lifestyle.

ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళ వారం హనుమ జయంతి వేడుకలు వేద పండితులు ధరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఉదయం 8 గంటల నుండి భానుపురి హనుమాన్ చాలీసా భక్త బృందం, హనుమత్ దీక్ష భక్త బృందం, హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. వేద పండితులు స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి నూతన పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆరగింపు, మంగళా శాసనం, తీర్థప్రసాద వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శించుకునిప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ లు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లింగమంతుల స్వామి దేవాలయం చైర్మన్ పోలబోయిన నరసయ్య యాదవ్, మోరీశెట్టి శ్రీనివాస్,కౌన్సిలర్లు ఎలిమినేటి అభినయ్, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ, నాయకులు బాలు గౌడ్ , అబ్దుల్ రహీం, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి , రాచకొండ శ్రీనివాస్ , ప్రవీణ్ రెడ్డి మధ్యబోయిన శ్రీనివాస్ ,చల్లా లక్ష్మీకాంత్,జయ ప్రసాద్, ఎస్ ఎల్ ఎస్ సాయి కృష్ణ, దేవాలయ అధ్యక్షులు కొత్తా ఆంజనేయులు కార్యనిర్వాహణాధికారి ఎం.పీ లక్ష్మణరావు, దరూరీ శ్రీధరాచార్యులు, ధరూరి శ్రీనాథ చార్యులు, ధరూరి పవన్ కుమార చార్యులు దరూరి కార్తీకా చార్యులు, శ్రీనివాసచార్యులు,మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, పబ్బా ప్రకాష్, పబ్బా రామమూర్తి, రజనీ,పురం నాగరాజు, తోట శ్రీనివాస్,లక్ష్మీ , దంతాల కొండల్ నాయుడు,తొనుకునూరి వెంకటేశ్వర్లు, ప్రసాద్,సతీష్, యరగాని కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.