Take a fresh look at your lifestyle.

ఘనంగా ప్రభుత్వ విప్ పీఏ సంతోష్ జన్మదిన వేడుకలు

ముద్ర, యాదగిరిగుట్ట :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వ్యక్తిగత సహాయకులు పీఏ సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో తోటి సిబ్బంది, అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీర్ల అయిలయ్య గారి వ్యక్తిగత సహాయకులుగా ఎంతో మంది బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్ఓసీలు అందేలా కృషి చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్న సంతోష్ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరణతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.
ఈ వేడుకలో పీఏ ఉపేందర్, పీఆర్వో ఆదిమూలం సురేష్, జాంగిర్, కిషన్, నవీన్, అజయ్ త్రివేది మణికంఠ, ప్రసాద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.