Take a fresh look at your lifestyle.

వీరవెల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కుంభం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

మండలంలోని వీరవెల్లి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం వీరవెల్లి గ్రామపంచాయతి నూతన పాలకవర్గం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అధిక నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు. హెచ్ఎండిఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పలు వార్డులలో నూతన డ్రైనేజీలు సీసీ రోడ్డు, బీటి రోడ్డు కు నిధులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు గ్రామ సర్పంచ్ తోటకూరి శంకరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సర్దార్ శ్రీకాంత్, మండల కాంగ్రేస్ నాయకులు 9వ వార్డు సభ్యులు సోకం రాజశేఖర్, వార్డు సభ్యులు కంచి పద్మ, చందుపట్ల స్వామి, నల్లారమేష్, సర్దార్ శోభ,
రాచ మల్ల సాయికిరణ్, తోటకూరి శ్రీలత, చిన్నం విజయ, మాధను శేవూరేయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.