Take a fresh look at your lifestyle.

వాణిజ్య సముదాయాలపై తనిఖీలు.. జరిమానా

కుషాయిగూడ , ముద్ర విలేఖరి: కాప్రా సర్కిల్ పరిధిలో పలు వాణిజ్యసముదాయాలు, హోటళ్లపై అధికారులు తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రంగా ఉన్న వారికి జరిమానా విధించారు. సర్కిల్ డిసి జగన్ ఆదేశాల మేరకు సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ పర్యవేక్షణలో గురువారం ఈసీఐఎల్, కుషాయిగూడ ప్రధాన రోడ్డు, చక్రిపురం చౌరస్తాలో ఉన్న పలు దుకాణాలను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను, చిరు తినుబండారాల బండ్లను తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో అపరిశుభ్రంగా ఉన్న హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాల యజమానులకు జరిమానా విధించారు.ఇలా పదిమందికి పైగా రూ.18000 జరిమానా విధించినట్లు సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ ముద్ర న్యూస్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోటల్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర దుకాణాల్లో ముందు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.అలాగే హోటల్లో తినుబండారాలను సూచి, శుభ్రతతో వినియోగదారులకు అందజేయాలన్నారు.నిల్వ ఆహార పదార్థాలను ప్రజలకు వడ్డించవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ విభాగం అధికార సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.