Take a fresh look at your lifestyle.

మహిళ పై బీజేపీ కపట ప్రేమ

 

– పారదర్శకం లేని రెండు బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకించింది
– మహిళ ల పై బీజేపీ కి ప్రేమ కాదు.. ప్రేమ పేరుతో డ్రామా
– మహిళకు ఏనాడు ప్రాధాన్యత ఇవ్వని బీజేపీ
– బీజేపీ పుట్టుక నుంచి ఇప్పటివరకు మహిళ ను జాతీయ అధ్యక్షురాలిగా నియమించారా
– మహిళ ల అభివృద్ధి పై కాంగ్రెస్ కు చిత్త శుద్ధి ఉంది
– బీజేపీ పచ్చి మనువాద పార్టీ
– రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
మహిళా, డిలిమిటేషన్ బిల్లు లపై బీజేపీ రాజ్యాంగానికి విరుద్దంగా ప్రవేశపెట్టిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని రోడ్డు రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్ నగర్ లో ని కాంగ్రెస్ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి,దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బీజేపీ తీరు పై మండిపడ్డారు.మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించే బీజేపీ నాటకాలు తేటతెల్లం అయ్యాయని,ఆ పార్టీ ఏనాడు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.బీజేపీ పక్కా మనువాద పార్టీ అని, ఇలాంటి పార్టీ తో దేశానికి ప్రమాదం అని పొన్నం తెలిపారు.మహిళా బిల్లు కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని లోకసభ లో బీజేపీ ప్రవేశ పెట్టిన విధానం సక్రమంగా లేదన్నారు. ఎప్పుడైనా మహిళా బిల్లుకు అన్ని రకాల సహకారాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నారు.కానీ బీజేపీ డిలిమిటెషన్ కు మహిళా బిల్లు కు లింకు పెట్టాలని చూసిందని, దీంతో ఈ బిల్లులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసిందన్నారు.


ఒక కుట్రపూరితంగా మహిళాబిల్లు ను పార్లమెంటులో ప్రవేశ పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేసిందన్నారు.తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును బీజేపీ ఎంపీ పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గమని, లోకసభ సాక్షి గా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎంపీ ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడం చూసి కూడా తెలంగాణ బీజేపీ ఎంపీ లు నోరుమెదపక పోవడం చూస్తే సిగ్గేస్తుందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కిషన్ రెడ్డిని రాజీనామా చేయమంటే పారిపోయాడని, ఈ నాడు ఆయన కేంద్ర మంత్రి గా ఉంది తెలంగాణ పై ఎంపీ మాట్లాడిన మాటకు కిషన్ రెడ్డి నోరు ఎందుకు మూసుకున్నారని పొన్నం ప్రశ్నించారు.బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మహిళను నియమించిందని,భాజపా జాతీయ అధ్యక్షురాలుగా మహిళకు ఈ రోజు వరకు అవకాశం ఇవ్వలేకపోయిందని విమర్శించారు.తేజస్వి సూర్య వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి వెంటనే తొలగించాలన్నారు.ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, మహిళా బిల్లును ఇండిజువల్ గా ప్రవేశపెడితే కాంగ్రెస్ ముందుండి ఆ బిల్లును పాస్ అయ్యేలా బాధ్యత తీసుకుంటుందన్నారు. అంతకు ముందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పంచవటి విద్యాలయ స్కూల్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అర్రైవ్ అలైవ్ ఇన్నగ్రేషన్ కార్యక్రమానికి మంత్రి పొన్నం తో పాటు స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రత వంటి పలు అంశాలు వివరించారు.ఈ కార్యక్రమం లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ,జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా , జిల్లా ఎస్పీ జానకీ , మేయర్ మమత ,డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి,
జిల్లా మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అర్రైవ్ అలైవ్ ఇన్నగ్రేషన్ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.