Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణన రిపోర్ట్ అబద్ధాల పుట్ట -పెద్దేముల్ మండలం మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య

 


ముద్ర, తాండూర్:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని, ఇది మాల సామాజిక వర్గ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మాల కులం,మరియు 26 ఉపకులల ​జనాభా తగ్గింపుపై ఆగ్రహం: 2011 జనాభా లెక్కల ప్రకారం ఉపకులాలతో కలిపి వర్గీకరణ విషయంలో మాల, మాలఉపకులల జనాభా,అదేవిధంగా కేవలం వర్గీకరణ విషయంలో షమీ అక్తర్ విడుదల చేసిన సందర్భంగా మాల కులం సింగిల్ జనాభా 1527143 చూపెట్టడం,మరియు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సర్వే ప్రకారం 1469463 గా తగ్గిచ్చి చూపెట్టడం ,అన్ని కులాల జనాభా పెరిగితే కేవలం మాల కులం యొక్క జనాభాను తగ్గిచ్చి చూపెట్టడం చేస్తే ఈ ప్రభుత్వం మాలలకు ఎంత అన్యాయం చేస్తుందో అర్థమౌతుంది.
అదే విధంగా మాల ఉప కులం ఐన మాదాసి కురావ జనాభా వర్గీకరణ చేసినప్పుడు 3707 గా చూపెట్టడం జరిగింది.ఇప్పుడు 53367 గా చూపెట్టడం జరిగింది. ఇది వాస్తవం జనాభా పెరిగింది ,కానీ మాల మాల అనుబంధ 26 కులాలను వేరు చేసి కేవలం మాల కులం యొక్క జనాభాను 1471514 చూపెట్టడం ,మళ్ళీ షెడ్యుల్డ్ క్యాస్ట్ లో ఉన్న కులాలను గందరగోళంలో పడేయడం జరిగిందని.
17,68,062 గా ఉన్న మాలల జనాభా, 15 ఏళ్ల తర్వాత పెరగాల్సింది పోయి ఎలా తగ్గుతుందని వారు ప్రశ్నించారు. గడిచిన కాలంలో జనాభా కనీసం 20 లక్షలు దాటాల్సి ఉండగా, ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపారని ఆరోపించారు.
​ఉపకులాల విభజన కుట్ర: బేడా బుడగ జంగలు, మాల సాలె, నేతకాని, మహర్, మదాసి, మాల దాసరి, బేగరి వంటి మాల అనుబంధ ఉపకులాలను మాలల నుండి వేరు చేసి చూపడం ద్వారా మాల సామాజిక వర్గ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
​సర్వేలో వైఫల్యాలు: అనేక గ్రామాల్లో ఎన్యుమరేటర్లు అసలు సర్వే చేయలేదని ప్రతిపక్ష నేతలు చెప్పిన మళ్లీ అవకాశం ఇవ్వకుండా చాలా కుటుంబాల దగ్గరకు వెళ్లకుండానే డేటా ఎంట్రీ సెంటర్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని ఆరోపించారు. రాజకీయ వివక్ష: రెడ్డి సామాజిక వర్గం జనాభాను ఎక్కువ చూపుతూ మాలల జనాభాను తగ్గించడం వెనుక సామాజిక, రాజకీయ, విద్య మరియు ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే కుట్ర ఉందని వారు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణను సమర్ధించుకోవడానికి ప్రభుత్వం ఈ దొంగలెక్కలను సృష్టించిందని విమర్శించారు. భవిష్యత్తు కార్యాచరణ: కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను తుడిచి పెట్టాలని చూస్తే మాలల పంతమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతం అవుతుందని హెచ్చరించారు. రాబోయే కేంద్ర ప్రభుత్వ జనగణనలో మాలలందరూ చురుగ్గా పాల్గొని మన కులాన్ని స్పష్టంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే ఈ తప్పుడు రిపోర్టును వెనక్కి తీసుకొని పారదర్శకమైన కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దముల్ మండల మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య, ఉపాధ్యక్షులు మల్లేశం, శ్రీనివాస్, రమాకాంత్, బలరాం, బందెప్ప, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.