బోడుప్పల్, ముద్ర: బోడుప్పల్ నగర పాలక సంస్థ కొత్త కమిషనర్ గా ఎ.శైలజ నియమితులయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆమె శుక్రవారం బోడుప్పల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతుకు ముందు జీహెచ్ఎంసీ పరిధిలోని సంతోష్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా ఆమె విధులు నిర్వహించే వారు. ఇప్పటిదాకా ఇక్కడ కమిషనర్ గా విధులు నిర్వహించిన జి.రామలింగం భువనగిరి మున్సిపాలిటీ కమిషనర్ గా బదిలీ అయ్యారు.