Take a fresh look at your lifestyle.

ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బిజెపి వినతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో మునిసిపల్ పాలన అధికారి, వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డక ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతుబంధు, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి అమలు చేయకుండా గ్రామ సభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ రైతుబంధు అర్ధరాత్రి దాటగానే మీ అకౌంట్లో పడిపోతాయని, ఒకసారి, మండలానికి ఒక గ్రామంలో పథకం అమలు ఉంటుందని, ఒకసారి ఇలా అబద్ధపు మాటలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ, జిల్లా కార్యదర్శి వైజయంతి, ఓబిసిమోర్చ జిల్లా అధ్యక్షులు డి ఎల్ ఎన్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, ఎస్సీమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడి కోటేష్, మాజీ కౌన్సిలర్లు నల్లమాస సుమ వెంకటేశ్వర్లు, జనగాం కవిత నరసింహచారి, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, ఎదగాని సంతోష్, మంగు నరసింహారావు, తంగళ్ళపల్లి గిరిధరాచారి, కొల్లోజు సతీష్, కొలిచిలిమ మల్లికార్జున్, తాడూరి రాజ్ కుమార్, నాగరాజు, వాస నర్సింగ్ పాల్గొన్నారు.

మండల పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతిపత్రం …. బిజెపి భువనగిరి మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి మండల కేంద్రంలోని తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు మాటూరి అనిల్ గౌడ్, నాగు వినోద్ కుమార్, నాయకులు క్యసాని శ్రీనివాస్ యాదవ్ మట్ట ఆంజనేయులు ఎస్టి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి భూక్య నరేష్ నాయక్, వెంకటేష్ నాయక్, వల్లపు సతీష్, ఓరుగంటి గణేష్, భువనగిరి సిద్దు, ఇస్మాయిల్ నాయక్, కర్ణాకర్,భరత్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.