- బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేందర్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను చేపట్టడం అభినందనీయమని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్ లోని మూడు ఉగ్రవాద సంస్ధలకు చెందిన తొమ్మిది శిబిరాల్లో దాక్కున్న టెర్రరిస్టులను పెద్దసంఖ్యలో ఆపరేషన్ సింధూర్ ద్వారా హతమార్చిన భారత సైన్యానికి మనమెంతో రుణపడి ఉన్నామని అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతకు భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టడం పట్ల దశప్రజలంతా గర్వపడుతున్నారని తెలిపారు.ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేలా చర్యలు తీసుకోవాలంటూ సైన్యానికి ఆదేశించడం ద్వారా భారత ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. భారతీయులకు హాని తలపెట్టాలని చూసే దుష్ట శక్తులను మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్దితుల్లోనూ వదిలిపెట్టదని, వాటి అంతు చూస్తుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని మోదీ మరోసారి నిరూపించారని అన్నారు. ఆత్మగౌరవ భారత్‌ను, దుర్భేధ్య భారత్‌ను తన సమర్ధ నాయకత్వం ద్వారా ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీకి, భారత సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలని ఆయన పేర్కొన్నారు.పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతకు దిగిన భారత సైన్యానికి, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ కి అండగా దేశప్రజలంతా నిలబడాల్సిన సమయమిదని ఆయన తెలిపారు.