Take a fresh look at your lifestyle.

వాళ్లు డబ్బులిచ్చినా బీఆర్ఎస్ కే ఓటేయండి -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చెల్లని నోట్లు ఇస్తారు జాగ్రత్త
ఓటు కోసం కాంగ్రెస్ తెగిస్తుంది
ముద్ర, పరకాల :
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు కోసం కాంగ్రెస్ నేతలు చెల్లని రూ. 2వేల నోట్లు ఇస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అలాంటి వారితో .జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరకాల పట్టణంలో బస్టాండ్ కూడలి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు నెరవేర్చకుండా ప్రజలు నష్టపోయేలా రేవంత్ రెడ్డి చేశారని ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీ ల బాండ్ పేపరు రాసిచ్చి వాటిని అమలు చేయలేక విఫలమయ్యారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకుల చొక్కా పట్టుకుని అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెల్లారి లేస్తే.. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిట్టడమే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కొరవడిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని నమ్మిన ప్రజలను నట్టేట ముంచారన్నారు. అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిన చందంగా మార్పు మార్పు అన్న ప్రజలు ఆగమయ్యారన్నారు. ఏ హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలని రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆడబిడ్డలు నిలదీయాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.