Take a fresh look at your lifestyle.

రూ. 5 భోజనానికి ఆటంకం ఉండదు – డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
పాలమూరు పట్టణం లో రూ. 5 కే భోజనం అందిస్తున్న నిర్వాహకులకు ఆటంకం ఉండదని, తన సొంత నిధులతో అన్నీ సౌకర్యాలు కలిపిస్తామని మున్సిపల్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. భోజన వసతి పై వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకున్న ఆయన బుధవారం బస్ స్టాండ్ వద్ద ఉన్న భోజన శాల ను సందర్శించి అన్ని వివరాలు తెలుసుకున్నారు.పేదలు భోజనం చేసేందుకు కనీసం నీడ వసతి లేదనే విషయం గుర్తించారు. నీడ కోసం వేసిన టెంట్ చిరిగిపోవడం తో వెంటనే కొత్త టెంట్ తో పాటు తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రఘు, నాయకులు మైత్రి యాదయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
…………………………

కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన
………………………………………..
పాలమూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి లోని 11వ డివిజన్ బండమీదిపల్లి లో యాదవ సంగం కమ్యూనిటీ హాల్ కు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం చిట్టెమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. 26వ డివిజన్ లో సాంబయ్య నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజీవ్ గృహ కల్ప లో నూతనంగా ఏర్పాటు చేసిన 25 KV ట్రాస్ఫార్మర్ ని ప్రారంభించారు. 11వ డివిజన్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మహబూబ్ నగర్ పట్టణానికి రొల్ మోడల్ గా మారుస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గిరి గౌడ్,ముజీబ్, రఘు,యాదవ్ సంగం అధ్యక్షుడు జంగయ్య యాదవ్, జగదీష్, బుచ్చయ్య, శ్రీను, యాదయ్య, తిరుపతయ్య గౌడ్, కాశీమ్, వడ్డే సంజీవ, జకీర్, ప్రభాకర్, అబిద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.