Take a fresh look at your lifestyle.

ఘనంగా మాజీ పార్లమెంటు సభ్యుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి 17వ వర్ధంతి వేడుకలు

  • నియోజకవర్గ కేంద్రంలో బి ఎన్ స్మారక స్తూపావిష్కరణ.

ముద్ర,తుంగతుర్తి: తెలంగాణ రైతాంగ పోరాటంలో మొట్టమొదటగా ఆయుధాన్ని చేపట్టి ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపి భూమికోసం భుక్తి కోసం ఎర్రజెండా నీడలో పోరాటం చేసి వెట్టి చాకిరి విముక్తి కోసం తన జీవితకాలం అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప సమరయోధుడు ప్రముఖ మాజీ పార్లమెంటేరియన్ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి అని ఆయన సేవలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలబడతాయని ఎం సి పి ఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయ అశోక్ అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బిఎన్ 17వ వర్ధంతి సందర్భంగా బి ఎన్ స్మారక స్తూపావిష్కరణ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కామ్రేడ్ బి ఎన్ శిష్యులు తాటికొండ సీతయ్య తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును శ్రీరామ్ సాగర్ కాల్వకు పెట్టాలని డిమాండ్ చేశారు.అలాగే అహర్నిశలు పేద ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసిన బిఎన్ విగ్రహాన్ని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బి ఎన్ సేవలను కొనియాడారు స్థూపావిష్కరణకు ముందు బియ్యం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న జిల్లా కార్యదర్శి సైదమ్మ సిపిఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి విజయమ్మ టిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ యాదగిరి మల్లు కపోతం రెడ్డి జీడి బిక్షం కొత్తగట్టు మల్లయ్య ప్రభాకర్ రామస్వామి నరసయ్య శ్రీనివాస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.