కరీంనగర్..
ప్రభుత్వ విప్ గా నియమితులై తొలిసారిగా పెద్దపల్లి వెళుతున్న ఎమ్మెల్యే విజయరమణా రావుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఆకుల నర్మద నర్సన్న కార్పోరేటర్లు, కాంగ్రెస్ నాయకులు సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శుక్రవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. టపాసులు కాల్చి స్వాగతం పలికి. శాలువాలతో ఘనంగా సత్కరించారు. కరీంనగర్ జిల్లా సరిహద్దు, బైపాస్ రోడ్డు, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఇంటి వద్ద విజయ రమణారావు కు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా విజయ రమణారావుకు వారంతా శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ రమణా రావు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం
కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి తో పాటు కరీంనగర్ నగరంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తానని పేర్కొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రభుత్వ విప్ గా నియమితులైన పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు కరీంనగర్ నియోజకవర్గ ప్రజల తరఫున వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ విజయ రమణారావు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలనీ ఆకాంక్షించారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ప్రజల ఆదరాభిమానాలు మరింత పొందాలని రాజేందర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఆకుల నర్మద నర్శయ్య స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, పడాల శ్రీజ అజయ్, గుమ్మడి రాజకుమార్, పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య, మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ పట్టణ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు రజిత రెడ్డి, నాయకులు సత్యనారాయణ రావు, సుదర్శన్ తోట రాజేందర్, నరసింహచారీ, రేగొండ సందీప్, వేముల శ్రీనివాస్ తిప్పారపు శ్రీనివాస్ జల్లోజు శ్రీనివాస్, దుగ్గు మహేందర్ పోరెడ్డి శ్రీధర్ బత్తిని కన్నయ్య గౌడ్ అట్టెపు వేణు, వాసు గౌడ్, ఇమ్రాన్, సూఫీయాన్, కపిల్ మాధవ్, ఆస్తాపురం తిరుమల, జ్యోతి రెడ్డి, హసీనా బేగం, శిల్ప, కనకరాజు, కార్తిక్, కౌశిక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.