Take a fresh look at your lifestyle.

ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి -ఎంపీ జీ నగేష్

బోథ్, ముద్ర:

కాంగ్రెస్ పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ లను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంధ్ తో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ క్షమాపణ చెప్పి వెంటనే హామీలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయల నిధులతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని కావున రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటోలను పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్,రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్లు, జిల్లా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.