Take a fresh look at your lifestyle.

విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం లో కేంద్ర మంత్రి రాజీనామాతో పాటు ఎన్ టీ ఎ ను రద్దు చేయాలంటూ వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న 21 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అవినీతికి నిలయంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి, పరీక్ష నిర్వహణ బాధ్యతలను తిరిగి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎస్ ఎఫ్ ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్, పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్, వాగ్మారే మహేందర్, గడ్పాళే పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.