Take a fresh look at your lifestyle.

గులాబీలో రాజకీయ సెగలు

  • హరీష్ రావు ఇంటికి కేటీఆర్.
  • రెండు గంటలకు పైగా మంతనాలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీలో వేడి సెగలు మొదలయ్యాయి. కొన్ని రోజులుగా ఆ పార్టీలో తెరచాటుగా ఏదో జరుగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు పార్టీనీ వీడనున్నారని ప్రచారం కూడా సాగుతోంది.ఇక కేసీఆర్ కూతురు కవిత సైతం తనపై పార్టీలో కుట్ర జరుగుతోందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న సమయంలో శుక్రవారంఈ రోజు హరీష్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు.ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అయితే హరీష్ తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పరామర్శించడానికే వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌ రావు ఇంటికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సతీసమేతంగా వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.దాదాపు రెండు గంటల పాటు హరీష్‌ రావు నివాసంలో కేటీఆర్ ఉండడం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా హరీష్ రావు పై కాంగ్రెస్ పార్టీ అనేక దుష్ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మారతాడని బిజెపిలోకి వెళ్తాడని కూడా కొంతమంది ప్రచారం చేశారు.అయితే దీనిపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చి తాను కేసీఆర్, కేటీఆర్ తోనే ఉంటానని ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఇంటికి హుటాహుటిన కేటీఆర్ వెళ్లడం జరిగిందని తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పేందుకే కేటీఆర్ ఇలా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ భేటీ కేవలం హరీష్ రావు తండ్రిని పరామర్శించడానికే వెళ్లారా లేఖ రాజకీయ కోణంలోనే వెళ్లారా అన్న అంశం మునుముందు తేలనుంది. ఇప్పటి వరకు ఈ అంశం సస్పెన్స్ గ కొనసాగనుంది.

Leave A Reply

Your email address will not be published.