ముద్ర ప్రతినిధి, నిర్మల్: మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఎం ఎల్ సి ఎన్నికలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మందకొడిగా కొనసాగింది.జిల్లాలో 17141 గ్రాడ్యుయేట్ ఓటర్లకు,1966 ఉపాధ్యాయ ఎం ఎల్ సి ఓటర్లకు 31 పోలింగ్ కేంద్రాలు నిర్మల్ నియోజకవర్గం లో ఏర్పాటు చేశారు.ముధోల్ నియోజకవర్గంలో 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కార్యాలయంలో ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ లో ఎన్నికల సరళిని పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలు అందించారు.ఇదిలా ఉండగా దాదాపు 56 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పోటీ పడటంతో బ్యాలెట్ పేపర్ అందించడానికి పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.దాదాపు దినపత్రిక సైజులో బ్యాలెట్ పేపర్ ముద్రించాల్సి వచ్చింది.మధ్యాహ్నం12 గంటల వరకు పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 20 శాతం కాగా,ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 35 శాతంగా నమోదైంది.అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ లోకేశ్వరం మండలంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసిన దంపతులు
