- తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పని చేస్తామని హామీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ్యుడు సందోష్ కుమార్ భేటీ అయ్యారు. శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన సందోష్ తో ఆమె పలు అంశాలపై చర్చించారు. సీపీఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో కలిసి సాహిత్య, సాంస్కృతిక అంశాల్లో పని చేస్తుందని సందోష్ తెలిపారు.