Take a fresh look at your lifestyle.

రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు భయపడేవారు కాదు

  • నాయకులు వెనకబడేసిన రాష్ట్రం.
  • ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టేందుకు దివాలా రాష్ట్రంగా చూపొద్దు.
  • స్వాతంత్య్రానికి పూర్వమే రైల్వే, విద్యుత్​, టెలిఫోన్​ సౌకర్యాలున్నాయి.
  • 2014లోనే సొంత పన్నుల ఆదాయం 29 వేల కోట్లు.
  • ఏటేటా 5 వేల నుంచి 10 వేల కోట్ల ఆదాయం పెరిగేది.
  • 2‌‌023 వరకే 1.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.
  • కేంద్రం పన్నుల వాటా క్రమంగా పెరుగుతోంది.
  • ప్రేమకు మాత్రమే లొంగుతారు.
  • ఆనాడు ఆర్టీసీ సమ్మె చేస్తే పాలకులే కాళ్ల బేరానికి వచ్చారు.
  • బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.​

ముద్ర, తెలంగాణ బ్యూరో : మాది ఎప్పుడూ వెనుకబడిన రాష్ట్రం కాదని, నాయకులు వెనకబడేసిన రాష్ట్రమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ ఖండించారు.తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రానికి నెలకు 20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే దివాళా తీసిందని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. చేతకాకపోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందే, నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో రైల్వే, విద్యుత్, టెలిఫోన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాకతీయులు తవ్వించిన చెరువులు తెలంగాణలో ఉన్నాయని అన్నారు.సన్న బియ్యం అన్నం తినే ప్రాంతంగా తెలంగాణ ఆనాడే వెలుగొందిందని అన్నారు.ఆనాడు తమిళనాడు ప్రాంతంలో అక్కడ జొన్న అన్నం తినే సందర్భంలో మన రామప్ప, లక్నవరం కింద వాళ్లు సన్న బియ్యం తినేవారన్నారు.సన్న అన్నం కోసం నిలబడ్డ చరిత్ర తెలంగాణాదని అన్నారు. సన్న బియ్యం తిన్న మొట్ట మొదటి రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా చూపడం సరికాదన్నారు. 2014 లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లు అని ఈటల తెలిపారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు అని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసాయన్నారు. 2014లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం 29 వేల కోట్ల రూపాయలని ఈటల రాజేందర్ చెప్పారు. ఏటా 5 వేల కోట్ల రూపాయల నుంచి 10 వేల కోట్ల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో లక్షా 19 వేల కోట్ల రూపాయలు, 2024-25వ సంవత్సరంలో లక్షా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని వివరించారు. పన్నేతర ఆదాయం 2014లో 6వేల కోట్ల రూపాయలు ఉండగా.. అది 2023-24లో 20 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన చెప్పారు. చేతకాకపోతే రాజీనామ చేయాలి కానీ, రాష్ట్రాన్ని దివాళా తీసిన రాష్ట్రంగా చూపించొద్దని హితవు పలికారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో (2014-2019), రాష్ట్ర ఆదాయం క్ర‌మంగా పెరిగిందన్నారు. 2014–15లో రూ. 29,285 కోట్లు, 2015–16లో రూ. 39,975 కోట్లు, 2016–17లో రూ. 48,000 కోట్లు, 2017–18లో రూ. 56,528 కోట్లు, 2018–19లో రూ. 64,000 కోట్లు, 2019–20లో రూ. 67,597 కోట్లు, కరోనా కాలంలోనూ 2020–21లో రూ. 66,000 కోట్లు, 2021–22లో రూ. 96,845 కోట్లు, 2022–23లో రూ. 1,07,000 కోట్లు, 2023–24లో రూ. 1,19,000 కోట్లు, 2024–25లో సైతం రూ. 1,28,000 కోట్ల ఆదాయం ఉందన్నారు.2025లో దాదాపు రూ. 1,30,000 కోట్లు రాష్ట్ర ఆదాయం ఉందని ఆయన పేర్కొంటూ ఈ లెక్కలు స్పష్టంగా బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తున్నాయని అన్నారు. దీన్ని దివాళా అని ఎలా అంటారు? అని ఎంపీ ఈటల ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అనుభవం లేమితో, బుద్ధిహీనతతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. సొంత సంపాదన మీదే, సొంత అభివృద్ధి మీదే ప్రేమ ఉందని, తెలంగాణ ప్రజలపై రేవంత్ రెడ్డి ప్రేమ లేదన్నారు. నిజంగా ఆపద ఉన్నపుడు గంభీరత, ప్లానింగ్ ఉండాలన్నారు. మరింత కమిట్ మెంట్ , కష్టపడే పద్ధతి, కోఆర్డినేషన్ ఉండాలన్నారు. అనుభవజ్నులైన సలహాలతో పాలనను పటిష్టంగా ముందుకుతీసుకుపోవాలి. కాని ఇంత తొందరగా నువ్వు కాడే తేలేస్తావని, తెలంగాణ సమాజాన్ని కుంగదీస్తవని, ఇంత తొందరగా దేశంలో తెలంగాణ పరువు తీస్తవని ఎవ్వరూ ఊహించలేదని ఎంపీ ఈటల అన్నారు.ఇది మీ దిక్కుమాలిన తనానికి, రేవంత్ రెడ్డికి పాలనలో అనుభవంలేనితనానికి నిదర్శనమని భావిస్తున్నామని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో అధికారం ఇస్తే ఇలానే ఖతం పట్టించారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారని ఎంపీ ఈటల మండిపడ్డారు. కాంగ్రెస్‌ని ఆదర్శంగా తీసుకోండి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి అని మాట్లాడుతున్నారు ఇదా మీ ఆదర్శమని ఆయన నిలదీశారు. నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఖతం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూసి ప్రజలు ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చామని బాధపడుతున్నరని అన్నారు.అధికారం అప్పజెప్పిన కర్మానికి వందేండ్లు చరిత్ర కలిగిన మా తెలంగాణ గొప్పతనాన్ని పాతరేయొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు.కావాల్సింది సుందరాంగుల పోటీలు కాదని, చేస్తే చేసుకో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ప్రజల మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.